మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు *ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గౌతమి నగర్ మండలంలోని ప్రగతి నగర్ శక్తి కేంద్రం అధ్యక్షుడు పూసాల ముని చందర్ ఆధ్వర్యంలో 223,224,225 బూత్ లకు సంబందించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.అదేవిదంగా బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రైతుల సౌకర్యార్థం తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం లోకి రావడం ఖాయం అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కాసిపేట శివాజీ, రామగుండం బిజెపి వైస్ ప్రెసిడెంట్ జూపూడి అమరేశ్వర రావు, కోఆర్డినేటర్ గాండ్ల ధర్మపురి, కార్పొరేటర్ కిషన్ రెడ్డి, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు,బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, అజయ్, అంజి మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా మోర్చా నాయకులు, కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: