మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆధ్వర్యంలో ముఖ్య మహిళా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో POW రాష్ట్ర నాయకురాలు నస్పూరి లక్ష్మి హాజరై మాట్లాడుతూ
తెలంగాణా వస్తే మనకంతా మంచే జరుగుతుందనుకున్నాం. వై.ఎస్.ఆర్. ప్రభుత్వం "పావలా" వడ్డీ రుణాలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తామని మానిఫెస్టోలో ప్రకటించింది. దీనికి డ్వాక్రా మహిళలు ఎంతగానో సంబరపడ్డారు. ఆర్థిక బాధల నుండి కొంతైనా ఉపశమనంగా వుంటుందని ఆశపడ్డారు. | కేసీఆర్ మాట నీళ్ళల్లో మూట
"మాట తప్పనూ... మడమ తిప్పను" అన్న కేసీఆర్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టగానే మహిళలకు మొండి చేయి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,78,470 సంఘాలుండగా 43,29,058 మంది సభ్యులున్నారు. మెప్మాలో | 1,81,295 సంఘాల్లో 19 లక్షల మంది పేద మహిళలు సభ్యులుగా వున్నారు. అంటే మొత్తంగా సుమారు 60 లక్షలకు పైగా మహిళలు తమ కష్టార్జితంతో వేల కోట్ల రూ॥లు పొదుపు చేసి బ్యాంకుల్లో జమ చేసి రుణాలు పొందుతున్నారు. ప్రతి నెలా వారంలోపు 12% వడ్డీ చెల్లిస్తున్నారు.
ఒక్క పూట ఆలస్యమయినా వడ్డీ లేని రుణం వర్తించదనే నిబంధనవల్ల భారం పెరుగుతుందని గాడిదయ్యి, బూడిదయ్యి, వెసులుబాటు లేక బయట అప్పు తెచ్చి సైతం కట్టేవారున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తిరిగి వడ్డీ డబ్బులివ్వకుండా నిర్లక్ష్య వైఖరి చూపిస్తోంది.
డ్వాక్రా మహిళలకిచ్చే బకాయిల నిమిత్తం 2021-22 బడ్జెట్లో వడ్డీ లేని రుణాలివ్వటానికి ప్రభుత్వం 3 వేల కోట్ల రూ॥లు కేటాయించగా కేవలం 200 కోట్లు మాత్రమే 2022 సం||ము విడుదల చేశారు. 2023-24 బడ్జెట్ లో మహిళలకిచ్చే 4,500 కోట్ల గురించి వూసే లేదు. వడ్డీలేని రుణాలు నయాపైసా కూడా ఇవ్వలేదు.
"అభయ హస్తం” పథకం కింద దాదాపు 20 లక్షల 76 వేల 403 మంది మహిళలు తమ వాటాగా డబ్బు జమ చేశారు. సుమారు 600 కోట్ల రూ॥లు ప్రభుత్వ ఖజానాలో వున్నాయి. సం॥లు గడుస్తున్నప్పటికీ పథకం అమలు చేయకుండా వారి డబ్బు తిరిగివ్వకుండా ప్రభుత్వం మహిళలను దగా చేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో, సిద్దిపేట జిల్లాలో రాజకీయ పబ్బం కోసం కొంత అమలు చేశారు.
పొదుపు చేసిన సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వలేదు. 10 లక్షల వరకు ఇస్తామన్న వడ్డీ రుణాలు వట్టి మాటేనని
అభయ హస్తం అటకెక్కించారు. అంతేకాదు "ఆమాద్మీ" ద్వారా సభ్యురాలి పిల్లల చదువులకిచ్చే స్కాలర్ షిప్లూ,సభ్యురాలు మరణిస్తే ఇవ్వాల్సిన ఆర్థిక సాయం, జీవన జ్యోతి, ఎస్సీ, ఎస్టీ మహిళకిచ్చే రాయితీ, ఇన్సూరెన్స్ తదితర
స్కీమ్లన్నింటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం సున్నా చుట్టింది. పథకం ద్వారా ఆర్థిక అభివృద్ధి లేదుగానీ, మహిళలు మరింత
అప్పుల పాలయ్యారు. ఈ స్థితిలోనే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కొరకు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో రేపు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించబోతున్నారు. రేపు జరిగే పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో POW నాయకురాలు మార్త రాదా, పెండ్యాల సాయక్క, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: