మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం ముర్మూర్, ఎల్లంపల్లి గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ఆత్మీయంగా పలుకరిస్తూ,
ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ..
వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థలం ఉన్న ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు సాయం అందిస్తామని, వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతీ రైతుకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తాం. కౌలు రైతులకు, రైతు కూలీలకు, భూమిలేని వారికి రూ. 15 వేల సాయం అందిస్తాం. పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం. పేదల కోసం రూ. 500 లకే సిలిండర్ అందిస్తాం. పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందాని తెలిపారు. తలాపునా గోదారి ఉన్న ఈ ప్రాంత రైతుల పొలాలకు నీరు అందడం లేదని ఆరోపించారు..
తలాపున గోదారి ఉన్న ఈ ప్రాంత రైతుల పొలాలకు నీరు అందడం లేదని, ఇక్కడి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాదుకు నీళ్లు తీసుకు వెళుతున్నారు కానీ ఈ ప్రాంత పొలాలకు చుక్కనీరు ఇవ్వడంలేదని ఆరోపించారు. గతంలో ఈ ప్రాంత రైతులకు నీరు ఇవ్వాలని మా నీళ్లు మాకు ఇవ్వాలని పాదయాత్ర చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప్రాంత రైతులకు నీరు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందాని రైతులకు భరోసా ను ఇచ్చారు.
ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఫీజు రియంబర్స్మెంట్, ఇంటికో ఉద్యోగం ఇలా అనేక హామీలు ఇచ్చి గెలిచి గద్దెనెక్కినంక హామీలు తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
అర్హులకు కూడా పెన్షన్ రావట్లేదని, ఎప్పుడో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లు తప్ప కెసిఆర్ ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇయ్యలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అంతేకాక గ్రామం లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, కెసిఆర్ ఇస్తా అన్న నిరుద్యోగ భృతి వెంటనే ఇయ్యాలని అన్నారు. పండిన పంటలకు గిట్టుబాట ధర రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతులకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే పెద ప్రజలకు న్యాయం జరుగుతుందాని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీసీల్ మండల ప్రెసిడెంట్ బరుపటి శ్రీనివాస్,అప్పల రాజేందర్,కో ఆర్డినేటర్ గాదె సుధాకర్, అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి,Ex:సర్పంచ్ గుంట బాపు, Ex:ఎంపీటీసీ కోలా రాంమూర్తి, బొడ్డు లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్,Ex:ఎంపీటీసీ గోపాల్ యాదవ్,దాసరి పోచమల్లు, గజెల్లీ శంకర్, బాధారవేణి రవి,గుమ్ముల మనోజ్,గుమ్ముల సుజిత్, గుమ్ముల శ్రీను,ఉప-సర్పంచ్ బరుపటి తిరుపతి,బియ్యలా శ్రీను,గజ్జెల నాగరాజు,వాసల రవీందర్, ఉప్పులేటి రాజేందర్,అయిడెపు తిరుపతి, రామస్వామి,మెరుగు కుమార్, మేడి ఓదెలు,ఓల్లెపు స్వామి, ఓల్లెపు సాయి, పెసరి సురేష్,ప్రేమ్,గుంట హనుమంత్,గుమ్ముల ప్రశాంత్,కొత్తకొండ సంతు,విజయ, కళ,దొబ్బల తరుణ్, రాజేష్, యాగండ్ల సుమన్,నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Post A Comment: