మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి, :నేతకాని కులస్తులు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఎదగాలని, చైతన్యం వస్తేనే హక్కులు సాధించుకోవడం సాధ్యపడుతుందని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. నేతకాని సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్ టి పి సి లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నేతకాని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 1986 లో నేతకాని సంఘ స్థాపించిన సీనియర్ నాయకులు కుమ్మరి మల్లయ్యకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే చిన్నయ్య
మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేతకాని జాతి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి జరగలేదని ఆవేదన చెందారు . ఏజెన్సీ ప్రాంతంలో నూటికి ఎనభై శాతం నేతకాని సమాజం ఉందని, వారికి పోడు భూముల సమస్య ఉందని, కొన్ని చట్టాల వల్ల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి పథకాలు వర్తించడం లేదని తెలిపారు. ఈ విషయంపై ఇదివరకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి విన్నవించినట్లు తెలిపారు.సమస్యల పరిష్కారం కొరకు సి ఎం హామీఇచ్చినట్లు తెలిపారు. హక్కులు రక్షించుకోవడానికి ఎందరో వీరులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు నేతకాని కులంలో సామాజిక స్పృహ చైతన్యం అవగాహన రావాలన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. మన హక్కులను సాధించుకోవడానికి నేతకాని కులస్తులు కలిసికట్టుగా హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని ఆయన కోరారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కల్పించిన రాజకీయ రిజర్వేషన్లను ఉపయోగించుకొని నేతకాని కులస్తులు ఎదగాలని ఆయన అన్నారు. నేతకాని యువతకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని ఆయన కోరారు. రాజకీయ అవగాహన లేకపోవడంతో నేతకాని కులస్థులు ముందు కు వెళ్లలేక పోతున్నారని, విద్యా పరంగా చాలా మంది యువత వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా హక్కులను సాధించుకోవడానికి ఉద్యమాలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు దుర్గం రాజేష్, దుర్గం నరసయ్య, ఆర్కే నేత కలాలి నరసయ్య గొల్ల రాజమల్లు దుర్గం గోపాల్ సెగ్గం రాజేష్ కొత్తపల్లి గంగేష్ జాడి ముసలయ్య కొయ్యల ఏమాజీ ,జనగం నరేష్ కుమ్మరి మల్లయ్య కామెర ప్రకాష్ దూట శేషగిరి దర్శనాల భువనచంద్ర సాయిని ప్రసాద్ బోర్లకుంట దీపక్ పోకూరి చినరాజయ్య అధిక సంఖ్యలో నేతకాని ప్రజలు పాల్గొన్నారు.

Post A Comment: