మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఈరోజు జరిగిన బోధనోపకరణాల ప్రదర్శనను మహాదేవపూర్ ఎంపీపీ బన్సోడ రాణి బాయి,సర్పంచ్ శ్రీపతి బాపు,తొలి మెట్టు మండల్ నోడల్ అధికారి శంకరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తూ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా తయారుచేసిన ఉపకరణాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. సర్పంచి మాట్లాడుతూ విద్యార్థులు అద్భుతాలు చేయాలంటే, ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాల్సి ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆకుల అశోక్,మహేందర్ రెడ్డి,మణిమాల కాంప్లెక్స్ సెక్రటరీ ఆర్ తిరుపతి,సీఆర్పీలు మరియు మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Post A Comment: