మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండల కేంద్రంలో,డీటీఫ్ జిల్లా శాఖ,మహాదేవపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో, ఆర్ ఇ డి సి ఓ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ఈరోజు మహాదేవపూర్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సోలార్ లాప్స్ పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణిబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, సర్పంచ్ శ్రీపతి బాపు పాల్గొన్నారు.డీటీఫ్ జిల్లాప్రధాన కార్యదర్శి అయిత తిరుపతి వృత్తి నిబద్దత సామాజిక బాధ్యత అనేది డీటీఫ్ యొక్క ప్రధాన కర్తవ్యం అని వివరించారు. మండలంలోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డీటీఫ్ మండల అధ్యక్షులు మడ్క మధు కోరారు.జోనల్ బాద్యులు తిరుపతి మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులను తీర్చిదిద్దడంలో డీటీఫ్ ముందుందని చెప్పారు. విద్యార్థులు చదవడంలో విద్యుత్ అంతరాయంలో కూడా చదువుకొనసాగాలని సౌరదీపాలు ఉపయోగ పాడుతాయని,బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు దేవేంద్ర అన్నారు.

Post A Comment: