ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా హనుమకొండ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆవిష్కరించారు.
జాతీయ జెండాను ఆయా శాఖల అధికారులు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా అధికారులు, అందరూ ఈ జాతీయ సమైక్య వజ్రోత్సవాలను ఘనంగా, కన్నుల పండుగగా జరుపుకున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన తెలంగాణ చరిత్ర ,సంస్కృతి, సాంప్రదాయ కార్యక్రమాలు వీక్షించి వారిని అభినందించారు. అనంతరం ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీకి ప్రత్యేకమైన విశిష్టత ఉందని అన్నారు.74 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు.రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందామన్నారు. భారత స్వాతంత్య్ర వజోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన పెల్లుబికేలా 15 రోజులపాటు జరుపుకున్నామని, దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ,మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్,డిసిసి బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, మాజీ కూడా చైర్మన్ మరి యాదవ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: