ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పోలీసు అధికారులు కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ వివిధ రకాల సమస్యలతో వచ్చిన 18 మంది బాదితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణమే విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. జిల్లాలోని పలు కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా, పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలనీ పేర్కొన్నారు.

Post A Comment: