BREAKING NEWS:
తెలంగాణలో గ్రూప్-1 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను TGPSC చైర్మన్ బుర్ర వెంకటేశం విడుదల చేశారు. అక్టోబర్ 21నుంచి 27 వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ మార్కులను TGPSC విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో కమిషన్ అధికారిక వెబ్సైట్లో మార్కులు తెలుసుకోవచ్చు. 563 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా, మంగళవారం గ్రూప్-2 ఫలితాలు విడుదల కానున్నాయి అని TGPSC తెలిపింది.
Post A Comment: