అత్మకూర్ మండలం, పెద్దపూర్ ఎం జే పీ పాఠశాలలో రేమిడి శ్రీనివాస్ రెడ్డి, జ్ఞాపకార్థంగా, రేమిడి మల్లారెడ్డి, విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేసిన విశేష ఘట్టం స్థానికంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని రేమీడి మల్లారెడ్డి, తన అన్న రేమీడి శ్రీనివాసరెడ్డి, స్మరణార్థంగా నిర్వహించడం గమనార్హం.
ఈ సందర్భంగా రేమీడి మల్లారెడ్డి , మాట్లాడుతూ, విద్య అనేది సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, విద్యార్థులు తమ చదువులో ఎంతో ప్రతిభ కనబరచి ఉత్తమ ఫలితాలు సాధించాలనే తాను ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. పరీక్షల్లో మెరుగైన మార్కులతో విజయవంతమై, తమ పాఠశాలకు, తమ గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఎం జె పి ప్రిన్సిపల్ దామేర అనిత, వైస్ ప్రిన్సిపల్ అనిత, గంట రాహుల్ రెడ్డి, జిట్టే మధు, రిశిత్ రెడ్డి, వర్షిత్ రెడ్డి, శేషు, ఉపాధ్యాయులు విద్యార్థులు,
పాల్గొన్నారు,
Post A Comment: