హన్మకొండ ; అంగన్వాడి ఉన్నతీకరణ పనులు అంగన్వాడీల లోని పెయింటింగ్, ఎలక్ట్రికల్, తాగునీరు, టాయిలెట్స్ సంబంధించిన పనులు త్వరగా పూర్తిచేయాలని హ నుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంగన్వాడీల అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీల పేర్లు రాసిన బోర్డులు బాగా కనిపించేట్టు ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్ పిల్లలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. అంగన్వాడీలకు మంజూరు చేసిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పూర్తి చేయాలన్నారు. మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని అన్నారు. అంగన్వాడీలకు ఉన్నతీకరణ పనులను గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తయిన వాటికి సంబంధించిన బిల్లులను డిడబ్ల్యుఓ కి సమర్పిస్తే వెంటనే పేమెంట్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ నెలాఖరులోగా పెయింటింగ్స్, టాయిలెట్స్, ఎలక్ట్రికల్ కనెక్షన్లు అంగన్వాడీల ఉన్నతీకరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యు ఓ జయంతి , పంచాయతీరాజ్ ఈ ఈ శంకరయ్య, టీజీ డబ్ల్యూ ఐ డి సి డి ఈ నరేందర్ రెడ్డి, అంగన్వాడి సూపర్వైజర్లు, ఏఈలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: