వసతిగృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రావిణ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌళిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రావిణ్య పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్‌ దామెర మండలం బాలసముద్రం క్రాస్‌ రోడ్‌ వద్ద గిరిజన సంక్షేమ బాలుర ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తణిఖి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పాఠశాల గదులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ స్టోర్‌ రూమ్‌లో నిలువ ఉంచిన బియ్యం, ఆహార పధార్థాలను పరిశీలించారు. కిచెన్‌షెడ్‌లో విద్యార్థులకు అందిస్తున్న బోజనం తయారీని పరిశీలించి వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని మెనూ ప్రకారం బోజనం అందించా లన్నారు. కిచెన్‌షెడ్‌లో పరిశుభ్రంగా ఉండేలా ప్రతిరోజు శుభ్రపర్చాలని బాధ్యులను కలెక్టర్‌ ఆదేశించారు.పాఠశాలలో 280 మంది విద్యార్ధులు ఉన్నారని, ఈ మధ్యనే పాఠశాలను కేటాయించడం జరిగిందని, త్రాగునీటి సమస్య ఉందని దృష్టికి తేవడం జరిగిందని వెంటనే నీటి నమూనాలను టెస్టింగ్‌కి పంపించడం జరిగిందని, ఐటిడిఏ ద్వారా అదనంగా బోరు, సంపు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదనంగా నిర్మిస్తున్న పనుల వివరాలను సంబంధిత శాఖ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట పరకాల రెవెన్యూ డివిజనల్‌ అధికారి నారాయణ, దామెర తహశీల్దారు జ్యోతి వరలక్షి , ఎంపిడి.ఓ శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: