హన్మకొండ ; కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కాంటా వేసి మిల్లులకు తరలించాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్స్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఏకేపి, పౌరసరఫరాలు, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2024`-25 వానాకాలం ధాన్యం కొనుగోలు, చెల్లింపు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 ఐకేపి సెంటర్లు, 109 పిఏసిఎస్ మొత్తం 157 సెంటర్ల ద్వారా వానాకాలం సీజన్‌కు సధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. 31 రైస్ మిల్లులకు కొనుగోలు కేంద్రాలను జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు. జియోట్యాగింగ్ వల్ల రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉత్వర్వులననుసరించి కొనుగోలు కొనుగోలు కేంద్రం నుండి రైతులప్రక్రియ గురించి సంబంధించిన 10 శాతం బ్యాంక్ గ్యారెంటీ అండర్ టేకింగ్ జరిగిందన్నారు. రైతుల వద్ద నుండి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్‌లోడ్ చేసి రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో త్వరితగతిన అప్‌లోడ్ చేసి సంబంధిత డ్రగ్‌సీట్‌ను కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఏఈవోలు టోకెన్లు అందజేయాలన్నారు. ధాన్యం రవాణా లో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. 2023`-24 సీజన్‌కు సంబంధించి పెండిరగ్ ఉన్న సి.ఎం.ఆర్ రైసును వారం రోజుల్లో క్లీయర్ చేయాలని మిల్లర్లకు సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్డీవో నాగ పద్మజ, డీసీఎస్వో దేవరాయి కొమరయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ , పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఉప్పునూతుల మహేందర్, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: