ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సఖి కేంద్రం ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సేవలకు సంబంధించిన పోస్టర్ తో పాటు వీడియోను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు సఖి కేంద్రాన్ని సంప్రదించినట్లయితే బాధిత మహిళలకు బాసటగా నిలుస్తుందన్నారు. సమస్యల్లో ఉన్న మహిళలు సఖి కేంద్రం వాట్సప్ నెంబర్ 7382983088, ఉమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇతర అధికారులతో పాటు సఖి కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: