ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా పరకాల మండలం రాజి పేట వద్ద సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం కోసం గుర్తించిన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం పరిశీలించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం కోసం అధికారులు 19 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించగా ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ, తహసిల్దార్ భాస్కర్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
సమీకృత గురుకుల పాఠశాల స్థలంతో పాటు రహదారి, ఇతర సౌకర్యాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మీడియాతో మాట్లాడుతూ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యాయని , ఇందులో పరకాల నియోజకవర్గం పరకాల మండలానికి ఒక స్కూలును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి 19 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించినట్లు పేర్కొన్నారు. సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి గుర్తించిన ప్రభుత్వ భూమికి నిర్ణయించిన హద్దులను పరిశీలించినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటుకు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరగనుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: