ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా పరకాల లో యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.
మంగళవారం హనుమకొండ జిల్లా పరకాల లోని ప్రభుత్వ పశు వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పశు వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బంది గురించి వివరాల తో పాటు పశువులకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పశువులకు అవసరమయ్యే శస్త్ర చికిత్సలు ఎక్కడ నిర్వహిస్తున్నారనే వివరాలను స్థానిక పశు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పశుసంవర్ధక, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏబీసీ సెంటర్ ఏర్పాటుకు తగిన స్థల సేకరణ, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పశు వైద్యశాల భవన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు అందజేయాలన్నారు.
ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ, తహసిల్దార్ భాస్కర్, జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ శ్రీనివాస్, పరకాల పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ విజయ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: