ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పక్కా కార్యాచరణతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.గురువారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024 సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు , డీఎస్సి సర్టిఫికెట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియ పై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి , ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, కమీషనర్ అఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జూ, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి లు, జిల్లా సమీకృత కార్యాలయం వి.సి. హాల్ నుండి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు సంబంధించి జిల్లాలో పటిష్ట కార్యాచరణ తీసుకోవాలని అన్నారు. 7 వేల పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. గతానికి భిన్నంగా ఈ సీజన్ నుంచి సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కౌంటర్లు , కాంటాలు ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక సిరియల్ నెంబర్ ఏర్పాటు చేయాలని, రైస్ మిల్లులకు తరలించే ధాన్యం బస్తాల పై ఆ సిరియల్ నెంబర్ వేయాలని అన్నారు. సన్న రకం ధాన్యం బస్తాల పై తప్పనిసరిగా సీరియల్ నెంబర్ ఉండాలని, దీనికి రెవెన్యూ కార్యదర్శులను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు.ధాన్యం కొనుగోలుకు అవసరమైన మేర గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా కమిషనర్ చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచి పోకుండా టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులలో ప్రచారం కల్పించాలని, అదే విధంగా సన్న రకం దాన్యం గుర్తింపు పక్కాగా జరిగేలా చూడాలని అన్నారు. బస్తాలలో నింపిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే లా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, ప్రతి రోజు పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు లో వచ్చే ఇబ్బందుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. రాష్ట్ర బార్డర్ల వద్ద పోలీసులు అప్రమత్తం కావాలని, ఇతర జిల్లాల నుంచి మన వద్దకు ధాన్యం రాకుండా చూడాలని అన్నారు. తాళ్ళు, తరుగు ఆంశం లో అవకతవకలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల నోడల్ అధికారులు ప్రతి రోజు కలెక్టర్ లతో కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షించాలని అన్నారు. సీఎంఓ అధికారుల సైతం నిరంతరం ధాన్యం కొనుగోలును పరిశీలించాలని, రెగ్యులర్ గా నివేదికలు అందించాలని అన్నారు. 11,062 టీచర్ల భర్త కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి విజయవంతంగా పరీక్షలు నిర్వహించి 1:3 క్రింద 25,239 మందిని ఎంపిక చేసి ఫలితాలు ప్రకటించామని, ఇప్పటి వరకు 9090 మాది అభ్యర్థులు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగిందని అన్నారు. 2 రోజుల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని, అక్టోబర్ 9 సాయంత్రం 4 గంటలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయాలని అన్నారు. దసరా కంటే ముందు టీచర్ల నియామకం పూర్తి కావాలని, జిల్లా కలెక్టర్లు దినిని ప్రాధాన్యత అంశంగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని అన్నారు. దొడ్డు రకం ధాన్యానికి ప్రపంచంలో డిమాండ్ తగ్గిపోతుందని, కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలు తగ్గించిందని అన్నారు. ప్రజలకు అందించే రేషన్ బియ్యం అక్రమ రవాణా, దుర్వినియోగాలను అరికట్టేందుకు జనవరి నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. సన్న రకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో తెలంగాణ వ్యాప్తంగా 60 శాతం మేర సన్న రకం ధాన్యం సాగు చేశారని, ప్రభుత్వం 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా తో చర్యలు తీసుకుంటుందని, దాదాపు 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్ల కొనుగోలు చేయబోతున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో అవసరాల మేరకు నూతన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అన్నారు. దొడ్డు రకం ధాన్యం సన్న రకం కోనుగోలు కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని అన్నారు. మిల్లర్ల వద్ద ఎటువంటి ధాన్యం కోతలు జర్గవద్దని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం భద్ర పరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్ గో డౌన్ సన్నద్ధం చేయాలని, ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఫోన్ నెంబర్ తో కూడిన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా బార్డర్ల వద్ద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
Post A Comment: