ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మహాత్మా గాంధీ సత్యం, అహింస, సత్యాగ్రహ మార్గాలను అనుసరించి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ని గాంధీజీ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య,డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్రం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా గాంధీజీ నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: