పెద్దపల్లి,గోదావరిఖని,అక్టోబర్,3(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ):మహిళ వయోవృద్ధుల సంక్షేమశాఖలో పనిచేస్తున్న బాల స్వర్ణలతకి ఉత్తమ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అవార్డు:అందజేసిన మంత్రి సీతక్క,పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లొ మహిళా,వయోవృద్ధుల సంక్షేమశాఖలో పనిచేస్తున్న గోదావరిఖనికి చెందిన బాల స్వర్ణలతకి ఉత్తమ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ గా అవార్డు దక్కింది.ఎంతో మంది వృద్ధులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు ఈ అవార్డు లభించింది.ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి డి.సీతక్క బాల స్వర్ణలతకి అవార్డు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు,ఉద్యోగరీత్యా సేవాభావంతో ఎంతో శ్రమకోర్చి సేవ చేయడం అనేది గర్వించదగ్గ విషయమని కొనియాడారు,అనంతరం బాల స్వర్ణలత మాట్లాడరు వృద్ధులకు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: