ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా ప్రజలు ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే శనివారం తెలిపారు.
ఎవరూ కూడా అనుమతి లేకుండా ర్యాలీలు, ఇతర సమావేశాలు నిర్వహించవద్దని ఎస్పి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రూ.50 వేలకు మించి తీసుకెళ్తే అందుకు సంబంధించిన వివరాలను చూపించాల్సి ఉంటుందని ఎస్పి వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. అలాగే సోషల్ మీడియా పై పోలిసు శాఖ నిఘా ఉంటుందని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు.
Post A Comment: