ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
భారాస పార్టీ కి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ బిఆరెస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మరుసటి రోజు వరంగల్ జిల్లా బిఆరెస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ రాజీనామా చేశారు. రమేశ్ ను పార్టీ లో కొనసాగేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు,కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో కెసిఆర్ దగ్గరకు వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆరూరి రమేశ్ ససేమిరా అంటూ పార్టీ కి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎంపి పసునూరి దయాకర్ కు టికెట్ ఇవ్వకపోవడంతో అన్యాయం జరిగింది అని భావించి ఎంపి పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. దీంతో బిఆరెస్ వరంగల్ లో ఉనికి కోల్పోయింది. వరుసగా షాక్ లు తగిలి బిఆరెస్ తల్వడమల్లడమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Post A Comment: