ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ :
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని CR నగర్ ( బాoబుల గడ్డ)లో ఏర్పాటు చేయబడిన స్టాటిక్ సర్వెలన్స్ టీమ్ చెక్ పోస్ట్ ను శనివారం ఎస్పీ కిరణ్ ఖరే తనిఖీ చేశారు. అక్రమంగా మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఎన్నికలలో ప్రభావితం చేసే బహుమతులను, రవాణా కాకుండా చెక్ పోస్ట్ ను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. 24 గంటలు చెక్పోస్టుల నందు తనిఖీ నిర్వహించాలని తనిఖి నిర్వహిస్తున్న సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి అని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఎస్పి పేర్కొన్నారు.
Post A Comment: