ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ మరియు హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన "స్పెషల్ కోర్ట్ ఫర్ ఎస్.పి.ఈ. అండ్ ఎ.సి.బి. కేసెస్-కం - 3వ అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ వరంగల్, "సెకండ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ -కం-సెకండ్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్- హనుమకొండ", "ఈ-సేవ కేంద్రం" మరియు "డిజిటైజేషన్ వింగ్" హన్మకొండ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.
ఈ నూతన కోర్టులు మరియు ఈ-సేవా కేంద్రం, డిజిటైజేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు టి.వినోద్ కుమార్, కె.లక్ష్మణ్ ( అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్, వరంగల్&హనుమకొండ) నామవరపు రాజేశ్వరరావు తదితర హైకోర్టు న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే రాధాదేవి, హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి మరియు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ మెంబర్లు బైరపాక.జయాకర్, దుస్స.జనార్ధన్, వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయవాద సంఘం అధ్యక్షులు ఈ.ఆనంద్ మోహన్ వై శ్యాంసుందర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
*ఎన్ఐటీ వద్ద ఘన స్వాగతం*
హనుమకొండలోని జిల్లా కోర్టుల సముదాయంలో కోర్టుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, హైకోర్టు న్యాయమూర్తులు వరంగల్ ఎన్ఐటి కి చేరుకోగా వరంగల్ హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కే.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, ఇతర న్యాయమూర్తులు పూల మొక్కలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఎన్ఐటి నుండి హనుమకొండ కోర్టుల సముదాయానికి చేరుకోగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. వేద పండితులు, న్యాయమూర్తులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
హనుమకొండ జిల్లా కోర్టుల సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటైజేషన్ ప్రారంభించుకోవడం తెలంగాణలో ఇదే ప్రథమమని అన్నారు. ఇక్కడే దీనిని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈ- సేవా కేంద్రాల సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
హనుమకొండ వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాదే, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ రాజేశ్వర్ రావు లను ఘనంగా సన్మానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బుజ్జిబాబు, మల్లికార్జున్, తదితరులు సత్కరించారు.
Post A Comment: