ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో పార్లమెంటు ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శనివారం నుండే పార్లమెంటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున తక్షణమే పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు , వివిధ రకాల ప్రచార సామగ్రిలు తొలగించాలని, 24, 48 ,72 గంటలలో తొలగించాల్సిన వాటిని సకాలంలో తొలగించాలని, ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయి ఫిర్యాదుల కమిటీని తక్షణమే పని ప్రారంభించేలా చూడాలని,నివేదికలను ఎప్పటికప్పుడు పంపించాలని, ఎన్నికలకు సంబంధించి తప్పనిసరిగా రూపొందించే సామగ్రి, ఇతర సామగ్రి పై దృష్టి సారించాలని, నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ,ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకునే విధంగా ముందు నుండి చర్యలు చేపట్టాలని, ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తక్షణమే స్పందించాలని, కంట్రోల్ రూమ్ ల ఏర్పాటుతోపాటు, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి టీములు తక్షణం పని ప్రారంభించాలని ఆదేశించారు.
ఎన్నికల షెడ్యూల్ తో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను మీడియా తో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని, సువిధ ద్వారా ఇచ్చే అన్ని అనుమతులకు తగు ఏర్పాట్లు చేయాలని, శాంతి భద్రతలు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, బందోబస్తు ప్రణాళిక, ఎన్నికల వెబ్ పోర్టల్ అప్డేట్ చేయడం, నగదు, మద్యం సీజ్ చేయడం ,ఎన్నికల ప్రవర్తనా నియమావళి తు.చ తప్పకుండా అమలు చేయడం, ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సితా పట్నాయక్ , అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకటరెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, డిఆర్ఓ వైవి గణేష్, హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, జడ్పీ సీఈవో విద్యాలత, డి ఆర్ డి ఓ నాగ పద్మజ, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, డిఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, బి డబ్ల్యు ఓ మధురిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: