ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను  నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. 

శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో లోక్ సభ ఎన్నికలు 2024 పై స్వీప్ కార్యక్రమాల  నిర్వహణ కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సన్నాహక  సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, తదితర పోటీలను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ ఆధ్వర్యంలో  విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలపై సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం సాగించాలన్నారు. మోడల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించాలని,  అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లలో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న పోలింగ్ కేంద్రాలలో  పోలింగ్ శాతం పెరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

 ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, జిల్లా పంచాయతీ అధికారి, స్వీప్ నోడల్ ఆఫీసర్ లక్ష్మీ రమాకాంత్, డిఆర్డిఓ నాగపద్మజ,  డిఇఓ డాక్టర్ అబ్దుల్ హై, జి డబ్ల్యు ఎం సి కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్,  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు,   నెహ్రూ యువ కేంద్ర  జిల్లా కోఆర్డినేటర్ అన్వేష్, సెంట్రల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, మెప్మా పీడీ  బద్రు నాయక్, డిస్ట్రిక్ట్  యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్, డిడబ్ల్యుఓ మధురిమ,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: