మేడిగడ్డ టీవీ న్యూస్ పుట్ట రాజన్న        

 


పెద్దపల్లి,ఓదెల:శ్రీరాంపూర్:నవంబర్,13:మేడిగడ్డటీవీన్యూస్,రైతులు మద్దతు ధర పొందడానికి నాణ్యత ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు.సోమవారం పెద్దపల్లి జిల్లా,ఓదెల మండల కేంద్రంలో,శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలో పర్యటించి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.అనంతరం అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ రైతులతో,అధికారులతో మాట్లాడి వివరాలను అడిగితెలుసుకొని,సంభందిత రిజిస్టర్ లను పరిశీలించారు.రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రంలోమౌళిక వసతులు ఉండే విధంగా చూడాలని తెలిపారు.రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పంట తీసుకొనిరావాలని,మద్దతు ధర కొరకు నాణ్యత ప్రమాణాలు పాటించాలని,ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త,తాలు,మట్టి పెడలు,రాళ్లు లేకుండా శుభ్రపరచాలని అన్నారు.ధాన్యం కొనుగోలు నిమిత్తం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని సూచించారు.ధాన్యం విక్రయించే సమయంలో తమ వెంట సెల్ ఫోన్ నెంబర్ ను ఆధార్ కార్డు,బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి తీసుకుని రావాలని,ధాన్యం విక్రయించే సమయంలో ఓటిపి కోసం సెల్ ఫోన్, ఆధార్ కార్డు,పట్టాదార్ పాస్ పుస్తకం,బ్యాంక్ ఖాతా పుస్తకం తీసుకొని వచ్చే విధంగా రైతులకు ముందస్తుగా తెలియజేయాలని అధికారులకు సూచించారు.రైతులకు మద్దతు ధర విషయంలో ఉండే సందేహాలు,ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ 1967/ 180042500333 నందు సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి,వ్యవసాయ,సంబంధిత శాఖ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: