ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో ఇంకను పంపిణీ చేయకుండా మిగిలి ఉన్న ఏపీక్ కార్డులను త్వరితగతిన పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు.
సోమవారం నాడు మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఎపిక్ కార్డుల పంపిణీపై ఎన్నికల అధికారుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 56753 కార్డు లు ఉండగా ఏపీక్ కార్డులు పంపిణీ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ కు పంపించడం జరిగిందని వాటిలో ఇప్పటివరకు43200ఏపీక్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని మిగిలి ఉన్న వాటిని త్వరితగతిన పంపిణీ చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, కలెక్టరేట్ ఏఓ సత్యనారాయణ, సురేష్ పాల్గొన్నారు.

Post A Comment: