ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ స్థానానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బిజెపి నుండి రావు పద్మ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, హనుమకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్ రమేష్ కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా పెండెం రాఘవరావు రెండు సెట్ల నామినేషన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పెండెం రాఘవరావు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఎ. ఐ. ఎఫ్. బి ) నుండి ఒకటి, స్వతంత్ర అభ్యర్థిగా మరొక నామినేషన్( రెండు సెట్ల)ను రిటర్నింగ్ అధికారి ఎల్. రమేష్ కు అందజేశారు. ఇప్పటివరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ స్థానానికి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.

Post A Comment: