ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ



హన్మకొండ ;

 ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల  పిలుపునిచ్చారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో హనుమకొండ జేఎన్ఎస్  స్టేడియంలో ఓటర్ క్యాంపెన్ భాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రద్ధ శుక్లా మాట్లాడారు. 18 సంవత్సరాల నిండిన  ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనిసూచించారు. ఓటర్ నమోదు శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. అనంతరం వాలీబాల్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ ఎం.హరిప్రసాద్, హనుమకొండ డి వై ఎస్ ఓ గగులోతు అశోక్ కుమార్, కోచ్ లు,  సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: