ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం కలెక్టర్ సిక్త పట్నాయక్ కటాక్షపూర్ ,నడి కుడా చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డు లను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రకాల వాహనాలను తనిఖీ చేయాలి అని, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అన్నారు. జిల్లా లోని వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి 3 చెక్ పోస్ట్లు,9 స్టాటిక్ సర్వలెన్స్ టీంలు, పరకాల కు 3 చెక్ పోస్ట్లు, 9స్టాటిక్ సర్వలెన్స్ టీంలు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ లు వరంగల్ వెస్ట్ కు 9, పరకాల నియోజకవర్గం కు 9 చొప్పున ఉన్నాయి అని, దీనితో పాటు రెండు వీడియో సర్వలెన్స్ టీంలు, రెండు వీడియో వ్యూయింగ్ టీంలు, రెండు అకౌంటుంగ్ టీం లు పని చేస్తున్నాయి అని అన్నారు.ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా డబ్బులు తీసుకువెళ్లే వ్యక్తులకు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల పాల్గొన్నారు.

Post A Comment: