ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నవంబర్ 30 న జరుగబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై దివ్యాంగులు మరియు వయో వృద్ధులకు మరియు జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం మంగళవారం రోజున సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయం ఎన్ఐసి హాలులో జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నవంబర్ 30న జరగబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లాలోని పశ్చిమ మరియు పరకాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ముఖ్యంగా దివ్యాంగులు వయోవృద్ధులు ఓటు హక్కు వినియోగించుటకు ప్రత్యేక సదుపాయాలు కల్పించినామని, ఆయా పోలింగ్ కేంద్రాలవద్ద దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు వీలుగా ర్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని, దివ్యాంగులను, వయో వృద్ధులను ఇంటి నుండి పోలింగ్ బూత్ వరకు తీసుకురావడానికి వాలంటీర్లను నియమించడం జరిగిందని, రాలేని పరిస్థితి ఉన్నవారికి రవాణా సౌకర్యం కూడా కల్పించామని, అందులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ ను అందుబాటులో ఉంచడం జరిగిందని, మానసిక దివ్యాంగుల కోసం సహాయకులను  ఏర్పాటు చేసామని, అయితే  ఒకరికి ఒక వ్యక్తి మాత్రమే సహాయం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని సంబంధిత అధికారులు, లైజన్ అధికారులు ఓటు శాతం పెంచుటకు తగు చర్యలు తీసుకోవాలని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాల ద్వారా ఏర్పాట్లను పరిశీలించాలని అన్నారు.

గతంలో 59 శాతం ఉన్న పోలింగ్ ను అందరి సమన్వయంతో ఈ సారి కనీసం 10% మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దివ్యాంగులు మరియు వయోవృద్ధులు వారి ఓటు హక్కును వినియోగించుకొనుటకు సంబంధిత ఆశ్రమాలు నిర్వాహకులతో ఓటు హక్కు వినియోగంపై చైతన్యపరచాలని అధికారులకు సూచించారు,

ఈ క్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రత్యేక దృష్టి సారించాలని లైజన్ అధికారి బాధ్యతలు తీసుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు,

 80 ఏళ్ల  వయసు పైబడిన వారికి మరియు పోలింగ్ బూత్ వరకు రాలేని ప్రత్యేక ప్రతిభావంతులకు బ్యాలెట్ వినియోగించుకొనుటకు నవంబర్ 8 వరకు అవకాశమున్నదని, వారు పోస్టల్ బ్యాలెట్  వినియోగించుకోవాలని తెలియజేసినారు, 

దివ్యాంగులు మరియు వయోవృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, జిల్లాలో  మహిళలకు ఐదు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ ఓటు పై అవగాహన కలిగి ఉండాలని, ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్ పోలింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస కుమార్, మెప్మా పీడీ భద్రు, అదనపు డిఆర్డిఓ శ్రీనివాస్ రావు, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్  బెంచ్ మెంబర్ కె అనితారెడ్డి, సూపరిండెంట్ లక్ష్మీకాంతరెడ్డి, 

ఐసిపిఎస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ 

ఎస్ ప్రవీణ్ కుమార్, డిపిఎం స్వప్న మాధురి, మరియు జిల్లాలోని స్పందన, బన్ను, అసుంతా ఆశా నిలయం, నవ్యశ్రీ మహిళా సొసైటీ,  డివైన్ మెర్సి, స్వయంకృషి మహిళా సొసైటీ, ఒయాసిస్ చారిటబుల్ ట్రస్ట్, వెంకటేశ్వర బధిరుల పాఠశాల. బోగవెళ్లి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ, కరుణాలయం, సెయింట్ ఆన్స్, దివ్యాంగులు, వృద్ధాశ్రమాల 

నిర్వాహకులు 

తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: