ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమాజం యొక్క అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను ప్రజలు ఎన్నుకొని ప్రజలను గందరగోళానికి గురిచేసి, అభివృద్ధి చేయకుండా ఆగం చేసే చీడపురుగుల్లాంటి నాయకులను తరిమికొట్టాలి అని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం శివనగర్ రైల్వే స్టేషన్ రోడ్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో ఫెర్టిలైజర్ అండ్ ఫెస్ట్ సైట్స్,సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నరేందర్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశానికి వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్, రాష్ట్ర రైతు విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేషర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తమ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే నరేందర్ కు తమ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఒక పేద బిడ్డకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే
కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్,ఇన్నర్ రింగ్ రోడ్, బస్ స్టేషన్, రోడ్లు,మోరీలు,24 అంతస్థుల హాస్పిటల్,బస్తి దవాఖాన, అండర్ గ్రౌండ్ డక్ట్,బండ్ అభివృద్ధి ఇలా ఎక్కడిక్కడ గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఇంత గొప్పగా చరిత్రలో నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో రెండు సంవత్సరాలు కరోనాలో పోయిన చరిత్రలో నిలిచిపోయే విదంగా అభివృద్ధి చేశా
నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజలు గులాబి పార్టీకి అండగా ఉన్నారని ఎదో జరిగిపోనట్టు కాంగ్రెస్ నాయకులు పుకార్లు షికార్లు చేసినంత మాత్రాన బిఆర్ఎస్ నాయకత్వానికి ఎం ఒరిగేది లేదన్నారు.
మైనారిటీలంతా ఏకమై ఒక్కటిగా రోజు కొన్ని వందలమంది నాకు మద్దుతూగా సమావేశాలు ఏర్పాటు చేసి నన్ను ఆశీర్వదిస్తున్నారు.
జక్కలొద్దిలో నా మీద పూర్తి నమ్మకంతో 8వేల మంది నాకు మద్దతు తెలిపి పార్టీలో చేరారు.
ప్రజల బాగు కోసం కమిట్మెంట్ తొ పని చేస్తున్న అందుకే నాకు ప్రజలు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు
ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పరకాల అవ్వగారిల్లు వరంగల్ తూర్పు అత్తగారిల్లు అని మాట్లాడి వరంగల్ పోయి తప్పు చేశా అని మాట్లాడారు వాళ్లు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు.
5ఏండ్లు ఇక్కడ లెనోళ్ళకు ఎట్లా ప్రజలు ఓట్లు వేస్తారు.
రాజకీయాలు,పార్టీలు ఏవైనా ప్రజల అభివృద్ధి చక్రం నడవాలి అందుకే గొప్పగా అభివృద్ధి చేస్తున్న బిఆర్ఎస్ సర్కారును గెలిపించండి.
కరోనా కష్టకాలంలో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసే వారు అందుబాటులో లేరు నేను ప్రజల్లో ఉండి 25వేల మందికి నిత్యవసరకులు పంపిణీ చేసి రెమెడీసివర్ ఇంజక్షన్లు బెడ్స్ అందించాను
ఇప్పుడు వచ్చే ఈ కాంగ్రెస్ బిజెపి నాయకులు ఒకరు ఫామ్ హౌస్ లో మరొకరు పౌల్ట్రీ లో ఉన్నారు తప్ప ప్రజల బాగోగులు చూడలేదు
అయినా ఈ వర్ధన్నపేట, వంచనగిరి వాళ్లకు మన గోస పట్టదు అందుకే ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ స్థితిగతులు తెలిసిన బిడ్డగా నన్ను ఎన్నుకోండి మరింత గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తా...
ఫెర్టిలైజర్ మరియు ఫెస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన్ వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాను మునుముందు మీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి మీకు అన్ని విధాలా అండగా ఉంటాను
కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించండి అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ మరియు సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు,డీలర్స్ పాల్గొన్నారు.


Post A Comment: