ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.

మంగళవారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఐ డి ఓ సి కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఓటు హక్కు నమోదు పై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా వోటింగ్ జరగాలి అని, ఓట్ ఫర్ స్యూర్” (నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను) అన్న నినాదంతో  స్వీప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.  ఓటరు జాబితాలో ఓటు ఉందా లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తెలుసుకోవాలని, ఓటు ఏ పోలింగ్ కేంద్రం, ఏ ప్రాంతంలోవుందో తెలుసుకోవచ్చని అన్నారు. మిషన్ 24లో భాగంగా బస్టాండు, రైల్వే స్టేషన్లతో పాటు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఆట-పాట, సంస్కృతి కార్యక్రమాలతో, బుర్ర కథలతో, ఫ్లాష్ మాబ్, 2కే రన్, ఎలక్షన్ కమిషన్ సింబల్స్ తో కుడకున్న రంగోలిలతో ఇలా ఎన్నో విధాలుగా ఓట్ హక్కు పై  అవగాహన కల్పించాలి అని అన్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలో నివసించే వారికీ ఓటు హక్కు పై అవగాహనా కల్పించాలి అని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా మిమ్స్ , కంటెంట్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అని అన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధంలాంటిదని  దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోనే విధంగా ప్రజలకు వివరించాలి అని విద్యార్థిని విద్యార్ధులు కోరారు. వచ్చే దీపావళి పండుగ రోజు సంద్భంగా దీపాలతో ఓట్ హక్కు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలని కోరారు. తాము చేసిన కార్యకలాపాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ మా సోషల్ మీడియా ఐ.డి లను వివరిస్తూ ట్యాగ్ చేయాలంటూ కోరారు.ఎన్నికల ఓట్ కు సంబంధించిన ఏదైనా వివరాలకు ఓటర్స్ హెల్ప్ యాప్ నీ వినియోగించాలని, టోల్ ఫ్రీ 1950 కాల్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు, సి-విజిల్ యాప్ ను తమ ఫోన్లలలో ప్లే-స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.

హనుమకొండ జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల విద్యార్థిని విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేపించారు.

ఈ కార్యక్రమంలో  ఇండస్ట్రియల్ మనేజర్ హరి ప్రసాద్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ క్యమునికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్.యస్.యస్. ప్.ఓ.లు. శ్రీ దేవి, శ్రీనివాస్, మాస్టర్జి కళాశాల పి.ఓ సూర్య నారాయణ, కాకతీయ విశ్వవిద్యాలయ పి.ఓలు, కిట్స్ వరంగల్, గౌట్. పాలిటెక్నిక్, కే.డి.సి, పార్కల్ గవర్నమెంట్ డిగ్రీ, వాగ్దేవి, ఎల్.బి డిగ్రీ & పి.జి, పింగిలి మహిళ కళాశాల లో నుండి విద్యార్థిని విద్యార్ధులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: