జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్
జుక్కల్ న్యూస్:
కామారెడ్డి నియోజకవర్గంలో కెసిఆర్ పై నామినేషన్ వేసిన యువ న్యాయవాది. రాజ్ గిరి సంతోష్ రెడ్డి కెసిఆర్ అరాచక పాలనను అంతమొందించడానికి తాను పోటీ చేస్తున్నానని వివరించారు. అలాగే గతంలో కూడా కేసీఆర్ పైన కల్వకుంట్ల కుటుంబం పైన వారు చేసిన అవినీతి పై కేసులు వేయడం జరిగింది. లిక్కర్ టెండర్, కాలేశ్వరం ప్రాజెక్టు, పోడు భూముల సమస్యలపై నిత్యం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎలాంటి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని వారు తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమంలో న్యాయవాద విద్యార్థి నాగరాజ్, మహమ్మద్ ఇక్బాల్, అంజద్ పాల్గొన్నారు.

Post A Comment: