ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ ఆధ్వర్యంలో శివనగర్ నాలుగు జెండాల వద్ద ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ కి శివనగర్ ప్రజలు,యువత అంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు.

ఈ చేరికల కార్యక్రమంలో ఇండిపెండెంట్ కాంటెస్టడ్ కార్పొరేటర్ హర్షం సురేష్(కిట్టు) మరియు వారి బృందం సుమారు 300వందల కుటుంబాలు నేడు ఎమ్మెల్యే,బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

శివనగర్ రోడ్లు అన్ని గొప్పగా మార్చి అద్దం లెక్క చేశాము

-శివనగర్ అభివృద్ధి చేయడం వల్ల భూమి విలువ భారీగా పెరిగింది

-శివనగర్ వరదకు మునగకుండా 43కోట్లతో అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణం చేశాము

-నాకు రాజకీయ జన్మనిచ్చింది శివనగర్

-ఇంటింటికి నల్లా,కరెంట్,కమ్యూనిటీ హాల్,రోడ్లు,మోరీలు,కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటుకు కృషి చేసాము

-సంక్షేమ పథకాలలో బాగంగా కళ్యాణాలక్ష్మి, షాదీముబారక్, ఆసరా,కేసీఆర్ కిట్టు,కంటి వెలుగు,రైతు బంధు ఇలా గొప్పగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.

-ఎన్నికల అనంతరం ఆసరా పెన్షన్ 2వేల నుండి 5వేలకు,వికలాంగుల పెన్షన్ 4వేల నుండి 6వేలకు పెంచుతున్నాం,సౌభాగ్యాలక్ష్మి ద్వారా ప్రతి మహిళకు 3వేల భృతి అందిస్తాం,400వందల కే గ్యాస్ సిలిండర్,ఇంటింటికి సన్నబియ్యం,ఆరోగ్య శ్రీ ద్వారా 15లక్షల వరకు వైద్యం చేయించుకునే వెసులుబాటు,రైతు బంధు 16వేలకు పంపు,ప్రతి ఒక్కరికి 5లక్షల బీమాతో మన ఇంటి పెద్ద లెక్క కేసీఆర్ మనల్ని ఆదుకుంటున్నారు.

-కాంగ్రెస్ పార్టీకి 55ఏండ్లు అవకాశం ఇస్తే శివనగర్ ఎందుకు అధ్వాన్నంగా ఉంది నేను ఎమ్మెల్యే  అయ్యాక అంత బాగు చేశాము వాళ్ళు అభివృద్ధి చేస్తే నేను కష్టపడి చేయాల్సి వచ్చేది కాదు

-కరోనా కష్టకాలంలో ఓట్లు అడిగే నాయకుకు ఒక్కరు కనిపించలేదు కానీ నేను మా కార్పొరేటర్లు 4మాస్కులు ధరించి ప్రజల్లో తిరిగి బెడ్స్,రేమిడిసివర్ ఇంజెక్షన్స్,25వేల మందికి సరుకులు పంపిణీ చేసాము

-మన ఇంట్లకు కిరాయికి వచ్చినోళ్ళ లెక్క ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ బీజేపీ నాయకులు వచ్చి పోయేటోళ్లు వాళ్ళు.

-వాళ్ళతో మనకు ఫాయిదా లేదు.

-మీ ఇంటి బిడ్డగా మీరు నన్ను ఏదైనా అడగొచ్చు అనొచ్చు బయట నుండి వచ్చిన వాళ్ళను ఎం అడగలేం 

-కాంగ్రెస్ బీజేపీ నుండి పోటీ చేసే వారు ఒకరు వంచనగిరి ఒకరు వర్ధన్నపేట మన ఆపతి సంపతిలో వాళ్ళ దగ్గరకి ఉరకాలి కానీ నేను లోకల్ అండర్ బిడ్జ్ దగ్గరే ఉంటా మీకు అందుబాటులో ఉంటా

-నియోజకవర్గాన్ని 4100వంద కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం 24 అంతస్తులు హాస్పిటల్ నిర్మించాము గొప్ప వైద్యం అందుతుంది

7గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశా,కలెక్టరేట్, బస్ స్టేషన్,ఇంటిగ్రేటెడ్ మార్కెట్,ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశా.

-నేను 500వందల నౌకరి నుండి వచ్చిన వాన్ని మీ గోసలు తెలుసు,మీరు ఎట్లా ఎదగాలి అనే ఆలోచనతో నేను పని చేస్తున్నా.

-అభివృద్ధిలో ముందు ఉన్నాం ఇక మన బిడ్డలకు ఉపాది కల్పన ద్యేయంగా ముందుకు సాగుతున్నాం

-కాంగ్రెస్ వాళ్లు అజంజాహి మిల్స్ అమ్ముకుంటే కేసీఆర్ పెద్ద మనసుతో మన తలాపున మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు మనకు 10వేల మందికి ఉపాది దొరుకుతుంది

-రాబోవు రోజుల్లో నియోజకవర్గాన కంపెనీలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు ఉపాది కల్పిస్తా.

-దుపకుంటలో 22వందల డబల్ బెడ్ రూమ్ నిర్మించాము,గృహాలక్ష్మి, దళితబంధు,బిసి బంధు ఇలా అన్నిపధకాలని ఎన్నికల అనంతరం ప్రజలందరికీ సర్దుబాటు చేస్తాం.

-మనకోసం కాదు మన బిడ్డల భవిష్యత్ కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గాన గులాబీ జెండా ఎగరాలి

నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి

పార్టీలో చేరిన వారిలో గుండు అనిల్, సాయి నూతన్ యాదవ్ రాహుల్ సాయి జయప్రకాష్ అశోక్ అభిషేక్ శ్రీనివాస్ నరేష్ వంటి వంశీ రాజు శ్రీకాంత్ కార్తీక్ వినీత్ శ్రీకాంత్ జున్ను పప్పు క్రాంతి గణేష్ రాకేష్ శివ పవన్ చందు ప్రణీత్ పరమేష్ శరత్ తో పాటు సుమారు 300వందల కుటుంబాలు పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ డివిజన్ అధ్యక్షులు కానుగంటి స్వామి, బిఆర్ఎస్ నాయకులు మెరుగు అశోక్ గడ్డ రవి, షేక్ అజ్మత్, మాజీ కార్పొరేటర్ కోటేశ్వరమ్మ, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు షేక్ ఇమ్రాన్ నీలం సుధాకర్, శబ్బు, లింగం, నగేష్, రాంబాబు ముఖ్య నాయకులు కార్యకర్తలు, మహిళలు హాజరయ్యారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: