ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అందరూ ఎన్నికల నియమావళి పాటించాలని డీఆర్వో యు. గణేష్ అన్నారు.
బుధవారం నాడు ఆయన తన కార్యాలయం లో లోకల్ కేబుల్స్, ఎఫ్ ఎం ఛానల్ ప్రతినిధులతోసమావేశం నిర్వహించారు
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు వివరించాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అయన తెలిపారు. ప్రతిరోజు ఎన్నికలకు సంబంధించిన అప్‌డేట్ ఈ మీడియా సెల్‌లో అందుబాటులో ఉంటాయని వివరించారు. మీడియా సంస్థలు, లోకల్ కేబుల్, ఎఫ్ ఎం లో ప్రసారం అయ్యో కార్యక్రమాలును తప్పకుండ ఎంసి ఎంసి కమిటీ ద్వారా మీడియా సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే ప్రసారం చేయాలి అని స్పష్టం చేసారు.ప్రసారం చేసే ముందు ఎంసి ఎంసి కమిటీ క్షుణ్ణం గా పరిశీలన చేయాలి అని అన్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పోస్ట్లు పై కూడ ప్రత్యేక శ్రద్ద పెట్టాలి అని అన్నారు.
ఎంసి ఎంసి కమిటీ, సోషల్ మీడియా సెల్ ప్రతీ రోజు సమావేశం నిర్వహించాలి అని, రిపోర్ట్ లను ఉన్నత అధికారులు కు పరదర్శకంగా పంపాలి అని అన్నారు.
ఈ సమావేశం లో ఎంసి ఎంసి కమిటీ సభ్యులు లక్ష్మణ్ కుమార్, కృష్ణ రెడ్డి, శ్రీధర్, భూపాల్, నిక్ అధికారి విజయ్ కుమార్, అరుణ, శ్రీధర్, లోకల్ కేబుల్ ఎంఎస్ ఓ లు, ఎఫ్ ఎం ఛానెల్ ప్రతినిధులు పాల్గొన్నారు.


Post A Comment: