ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాబోయే అసెంబ్లి ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు.

బుధవారం ఏనుమముల మార్కెట్ లో గల ఈ.వి.ఎంల స్ట్రాంగ్ రూమ్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లులను, సిపి అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, రిటర్నింగ్ అధికారులు రిజ్వాన్ భాషా షేక్, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి సందర్శించారు.

జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ మెటీరియల్, ర్యాండమైజేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 

పోలింగ్  కౌంటింగ్ లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను ఆర్వోలు సమీక్షించుకోవాలని,  కౌంటింగ్ కొరకు ప్రేవేశం, బయటకు వెళ్లేదారి, బ్యారిగేట్లు అదే విదంగా ఎన్నికల భద్రత, విద్యుత్, వి.ఐ.పి పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్ అరేంజ్మెంట్స్, పోలింగ్ ఏజెంట్లుకు కావాల్సిన నీటి, టాయ్లెట్ల సౌకర్యం, పార్కింగ్ లలో ఏటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం ల వద్ద తో పాటు పరిసర ప్రాంతాలలో భద్రత అత్యంత కట్టుదిట్టంగా అమలు చెయ్యాలని ఆదేశించారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఇంకా ఏమైనా అదనపు ఏర్పాట్లు ఉంటే త్వరతగిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఎలక్షన్ మెటీరియల్ రూమ్, ఈవీఎం కమిషన్ హాల్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్ అకౌంటింగ్ టీం, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, వీడియో వ్యువింగ్ టీం సెల్ ల సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ముందు చుట్టూ సీసీ కెమెరాలు ఉండాలి అని తెలిపారు.  ఫైరింగ్ కు సంబంధించి ఏమైనా సమస్యలు తలెత్తితే వెనువెంటనే పరిష్కరించడానికి ఫైర్ వాహనాన్ని అందుబాటులో డిస్ట్రిబ్యూషన్ అయ్యేంత వరకు 24/7  తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, అశ్విని తణజి, హనుమకొండ ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, అర్.డి.ఓలు రమేష్, శ్రీనివాస్, ఎసిపి రవీందర్, డీసీపీ భా తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: