ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

దేశ అభివృద్ధి పథంలో కీలక భూమిక పోషించే యువత చేతిలో ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని హన్మకొండ అదనపు కలెక్టర్  (ట్రైనీ) శ్రద్ద శుక్ల  తెలిపారు. తొలి సారిగా ఓటు వేసే యువత ఉత్సాహంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వరంగల్ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో  హన్మకొండలోని 

కాకతీయ డిగ్రీ కళాశాలలో నేడు ఓటు హక్కు పై చైతన్య కార్యక్రమం నిర్వహించారు.

ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సురునేని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి శ్రద్ద శుక్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓటు హక్కు పై కేడీసీ విద్యార్థులకు నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం శ్రద్ద శుక్ల మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలోని యువత పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచాలని కోరారు. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని గుర్తించాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు.

సభా అధ్యక్షత వహించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార అధికారి శ్రీధర్ సురునెని మాట్లాడుతూ తమ విభాగం ద్వారా ఓటు హక్కు పై చైతన్య కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థి, యువత ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేస్తున్నమన్నారు. తక్కువ ఓటు శాతం నమోదైన జిల్లాల్లో హన్మకొండ ఉన్నందున యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేడీసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజి రెడ్డి, హన్మకొండ స్వీప్ నోడల్ అధికారి హరిప్రసాద్, సమాచార ప్రసార సంబంధాల శాఖ ఏడీ లక్ష్మణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గేయ నాటక విభాగం వారిచే ఈ సందర్భంగా ఇంద్రజాల, కళా ప్రదర్శన నిర్వహించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: