ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండ అర్బన్లో నూటికి నూరు శాతం ఓటింగ్ జరిగే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలి అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ అన్నారు.

శుక్రవారం నాడు కలెక్టర్, అడిషనల్  కలెక్టర్ మహేందర్ జీ తో కలసి శాసన సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వీప్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్లను చైతన్యం చేస్తున్నారని అన్నారు. నవంబరు 30న పోలింగ్ ఉండటంతో ఆ రోజు ఓటుహక్కు ఉన్న వారంతా వినియోగించుకోవాలని ముమ్మర ప్రచారం చేయాలి అని సూచించారు.

 మారుమూల పల్లెల్లో  పోలింగ్ శాతం పెరుగుతుండగా అర్బన్ లో తక్కువగా నమోదవడం ఆందోళన కల్గించే విషయం అన్నారు. ఓటేసేందుకు ఆసక్తి చూపడానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. డిగ్రీ కళాశాల్లో అధికారులు యువతకు అవగాహన కల్పించాలి అని అన్నారు. ఓటింగ్ పెంచేందుకు మిషన్ 29 కింద అర్బన్ లో 23 డివిజన్ల లో 23 మంది అధికారులను నియమించామని అన్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్లతో పాటు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ అవగాహన కల్పించాలి అని అన్నారు . పోలింగ్ కేంద్రాల వారీగా ఇంటింటికి సిబ్బంది వెళ్తూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వివరిస్తున్నారు.గేటెడ్ కమ్యూనిటీ లో నివసించే వారికీ ఓటు హక్కు పై అవగాహన కల్పించాలి అని అన్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి అని అన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధంలాంటిదని దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోనే విధంగా ప్రజలకు వివరించాలి అని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి, నోడల్ అధికారి హరిప్రసాద్, మేప్మ డైరెక్టర్ భద్రు నాయక్, సోషల్ వెల్ఫేర్ డి.డి నిర్మల, డి.టి.డబ్లో.ఓ ప్రేమకళా, లీడ్ బ్యాంక్  మేనేజర్ శ్రీనివాస్, డి.పి.ఓ జగదీష్, డి.ఎం.అండ్ హెచ్.ఓ సాంబశివరావు, రమేష్ తదితరులు ఓట్ ఫర్ షోర్ అనే కరపత్రాన్ని విడుదల చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: