జుక్కల్ మండల్ ప్రతినిధి / క్రిందిదొడ్డి నాగరాజ్
జుక్కల్ లో జోరు అందుకుంటున్న బిజెపి;ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గం లోని పలు గ్రామాలకు వెళుతూ నిన్న రాత్రి జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి బిజెపి పార్టీ అభ్యర్థి అయిన టి అరుణతార రావడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణలోని సమస్యలు మరియు ఇక్కడ స్థానికంగా వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఇక్కడనే విద్యావ్యవస్థను కూని చేశారని ఎక్లార వద్ద ఉన్న పాఠశాల వరుసగా రెండుసార్లు ఆత్మహత్యలు జరిగిన అక్కడ ఉన్న సమస్యలు పట్టించుకునే నాధుడు లేడు స్థానికంగా ఎవరైనా వెళితే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. అలాగే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి మరొక్కసారి అవకాశం ఇవ్వాలంటే ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారంలో జుక్కల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు శివాజీ పటేల్, బిజెపి కార్యకర్తలు డాక్టర్ కిరణ్ , ప్రశాంత్ పటేల్, వినోద్ గౌడ్, పవన్ కుమార్, రాముని సెట్, సంతోష్ రెడ్డి, మనోహర్ పటేల్ బస్వాపూర్ గ్రామ యువకులు శ్రావణ్ బాబు, లక్ష్మణ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.


Post A Comment: