పెద్దపల్లి:మంథని:నవంబర్:6:మేడిగడ్డటీవీన్యూస్.ఛానల్:మంథని నియోజకవర్గం బీఅర్ఎస్ లో చేరిన భూపాలపల్లి జిల్లా బీజేపీ-కోశాధికారి దుర్గం తిరుపతి బీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు,కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు స్వచ్చందంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు.మంథని నియోజకవర్గంలోని తూర్పు మండలాలతో పాటు రామగిరి,కమాన్‌పూర్‌మహాదేవపూర్,కాటారం,ముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ గూటికి చేరడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత వారం రోజులుగా తూర్పు ప్రాంతంలోనే కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచే కాటారం మండలం నుంచి బారీగా చేరికలు జరుగుతున్నాయి.దీంతో రోజురోజుకు మంథనినియోజకవర్గంలో గులాబీ సైన్యం పెరిగిపోతుంది.బారీ చేరికలతో కారు స్పీడ్‌కు కాంగ్రెస్ బేజారవుతుందని,పలువురు మేదావులు పేర్కొంటున్నారు.తాజాగా మంథని పట్టణంలోని రాజగృహాలో పలు మండలాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.భూపాలపల్లి జిల్లా-బీజేపీ కోశాధికారి దుర్గం తిరుపతితో పాటు సుమారు వంద మంది ఆయన అనుచరులు సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు.మంథని నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు,అభివృధ్దిని చూసి బీఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు,అభివృధ్ది,సేవచేసే మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి గెలుపుకోసం పని చేస్తామని తెలిపారు.
Home
Unlabelled
మంథనిలో నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు:బీఆర్‌ఎస్ జోరు:కాంగ్రెస్ బేజారు!. పుట్ట మధూకర్‌కు మద్దతుగా గులాబీసైన్యం..

Post A Comment: