ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజషన్ పూర్తి చేసినట్లు జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్ ఎన్ గోపాలకృష్ణ, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు సిక్త పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం నాడు కలెక్టరేట్ లో గల నిక్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు పోలింగ్ సిబ్బంది రెండవ విడుత ర్యాండమైజేషన్ చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు నియోజక వర్గాలకు సంబంధించి మొత్తం 789 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మొత్తం 3788 మందిని రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నిక చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 947 మంది పీవో లు, 947మంది ఏపీవో లు, 1894 మంది ఓపివో లు ఉన్నారన్నారు. ప్రతి టీములో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు అదర్ పోలింగ్ ఆఫీసర్లు ఉంటారన్నారు. నియోజక వర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 5 మహిళా టీములు, ఒక యూత్ టీమ్, ఒక దివ్యాంగుల టీమ్ ఎంపిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వీరందరికి శిక్షణ ఇచ్చి, హోమ్ ఓటింగ్ కు ఉపయోగించనున్నట్లు ఆయన అన్నారు. మంగళవారం చేపట్టిన రెండవ విడుత ర్యాండమైజేషన్ కార్యక్రమం ద్వారా ఎన్నిక కాబడిన వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర మహేందర్ జీ, అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ద శుక్ల, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, ఎన్ ఐసి అధికారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: