ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్*
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్: మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది.ఇందులో భాగంగా బుధవారం నాడు మండలంలోని హాసన్ మహమ్మద్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామంలోని ప్రతి ఇంటి ఇంటికి కాంగ్రెస్ ఆరు వాగ్దానాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ ఇన్ని రోజులుగా స్థానికత పేరు చెప్పుకొని మండలానికి, నియోజకవర్గం కు చేసిన అభివృద్ధి శూన్యం అని ఆయన తెలిపారు. అన్ని వర్గాల చూపు కాంగ్రెస్ వైపే వుందని, బిఆర్ఎస్ మేనిఫెస్టో బూటకమని ప్రజలే గుర్తిస్తున్నారు అని ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఐదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి ప్రజలు గుర్తించారని కావున ప్రజలు మార్పు కోరుతున్నారని కాబట్టి ఈ సారి దామోదర్ రాజనర్సింహ గెలుపు ఖాయమని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ పై నమ్మకంతోనే వివిధ పార్టీల నుండి నాయకులు ,ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్, మండల కాంగ్రెస్ నాయకులు భక్తుల కిషోర్,కో ఆప్షన్ నెంబర్ షేక్ మజార్, ఆశీలి సాగర్, చంద్రమోహన్ రెడ్డి, ఆకులపల్లి పాపయ్య,మహేష్ గౌడ్,దండు కాంతం, సల్ల అనిల్,చల్ల నర్సింలు,శివ గౌడ్,ఎర్రోళ్ల ప్రవీణ్,సాయి శేషు గౌడ్,కుష్టి పోచయ్య, శివచందర్, దుర్గయ్య, నీలగిరి రాజు,రవి,ఎక్కిళ్ళ రాములు, బానోతు లాలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
అన్ని వర్గాల చూపు కాంగ్రెస్ వైపే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ టేక్మాల్ మండలంలోని హాసన్ మహమ్మద్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం స్థానిక పేరుతో టేక్మాల్ మండలానికి చేసిన అభివృద్ధి శూన్యం..

Post A Comment: