ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

సి-విజిల్ యాప్ ద్వారా పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదు చేయాలని , జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సీక్త పట్నాయక్ తెలిపారు.

గురువారం నాడు కలెక్టర్ కంట్రోల్ రూమ్ సందర్శించారు. టోల్ ఫ్రీ నంబర్ 1950, సి-విజిల్ యాప్ పని తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు, రిజిస్ట్రార్లను పరిశీలించారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి - విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని తెలిపారు. 

సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదు లపై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జి.పి.ఎస్. ఆన్ లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిగ్గా లోకేషన్ నమోదు అవుతుందని, సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత కామెంట్స్ చేసిన, పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించిన, ఇతర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ ఫోటోలు, వీడియోలు సి - విజిల్ యాప్ ద్వారా పంపాలని సూచించారు. 

యువత సి-విజిల్ యాప్ ను ఉపయోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ఉల్లంఘన లను తమ దృష్టికి తీసుకుని రావాలని, 24 గంటలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం నుండి సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్ లను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు.

సి-విజిల్ యాప్ ను తమ ఫోన్లలలో ప్లే-స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని  జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్  తెలిపారు ఇప్పటి వరకు సి-విజిల్ యాప్ ద్వారా 49 కేసులు నమోదు కాగా అందులో 7 సమస్యలు పరిష్కారం అవ్వగా, అందులో 42 డ్రాప్ కేసులు.ఇది ఇలా ఉండగా ఓటర్ వివరాల కోసం 1950   టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు అని కలెక్టర్ తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: