ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్  ఆదేశానుసారం హనుమకొండ పట్టణ పరిధిలో డాక్టర్లు, సిబ్బంది ద్వారా స్వీప్ ఓటర్ల అవగాహన మరియు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునే విధముగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైధ్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్.బి. సాంబశివ రావు తెలిపారు. గురువారం  వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఎన్జీవోల  కాలనీ నుండి ప్రోగ్రాం అధికారులు, డాక్టర్లు మరియు సిబ్బందితో కలసి అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు కలిగి ఉండటం, అలాగే ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 30 వ తేదీన జరిగే శాసన సభ ఎన్నికలలో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తుందన్నారు. అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాలీలు, అలాగే హెల్త్ క్యాంపులు, రక్త దాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని హాజరైన వారికి ఓటు ప్రాద్యాన్యత గురించి అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ఐఎంఏ , స్వచ్చంద సంస్థలను జిల్లా స్థాయి ర్యాలీలలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీ ఎన్జీవోల  కాలనీ, బాలయ్య హోటల్ మీదుగా వడ్డేపల్లి వరకు నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన ర్యాలీలో  జిల్లా అదనపు వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మదన్ మోహన్ రావు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యాకూబ్ పాషా, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ ఉమా శ్రీ, వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రo వైద్యాధికారి మాలిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, ఆర్బీఎస్కే  మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గ ప్రసాద్, డిప్యూటీ డెమో ప్రసాద్, సి‌హెచ్‌ఓ మాధవ రెడ్డి, వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రo 

సిఓ  మానస, డిపిఓ  ఎన్ హెచ్ ఎం శ్రీనివాస్, సూపర్ వైసర్ గోవర్ధన్ రెడ్డి, కమలాకర్, పట్టణ ఆరోగ్య కేంద్రo సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: