పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:2: 23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమీల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు,ఈ సందర్భంగా వారు మాట్లాడరు,రామగుండం ప్రెస్ క్లబ్ ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా,సంవత్సరం పాటు క్లబ్ అభివృద్ధికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు(కమిటికి)సభ్యులకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం క్లబ్ లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందున,పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోనందున సభ్యుల,కార్యవర్గ సభ్యుల ఫిర్యాదు మేరకు,ప్రధాన కార్యదర్శి అయిన పర్కాల లక్ష్మీనారాయణగౌడ్ ని తన పదవి నుండి తొలగించి,(బహిష్కరించినారు)పూర్తిగా సభ్యత్వాన్ని కూడా తొలగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు,ప్రెస్ క్లబ్ కమిటీని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని క్లబ్బు సభ్యుల,కార్యవర్గ సభ్యుల అభ్యర్థన మేరకు ఎన్నికలు జరిపి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు,దీనిలో భాగంగా అధ్యక్షులు షేక్ జమీల్ హుస్సేన్,ఉపాధ్యక్షులు కొండ్ర అంజయ్య,కోశాధికారి కండే రవీందర్ లు కొత్త కమిటీకి స్వాగతిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు,కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేవరకు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్లు పూసల రవి,ఆవుల రాజేష్ యాదవ్ లకు తాత్కాలికంగా క్లబ్బు పూర్తి బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని,పూర్తి బాధ్యతలు ఇచ్చినారు,కొత్త కమిటీ ఏర్పాటుకు ఎలక్షన్లు త్వరలో నిర్ణయిస్తామని ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్లు తెలిపారు.

Post A Comment: