మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండల పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అంబట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ సంపద దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుందని విమర్శించారు. పెద్దలు, అమ్మలు, సోదర, సోదరీమణులు, యువత అంతా చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి, మరోసారి మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని..కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తామని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ మూడు పార్టీలు ఒక్కటేనని ఆక్షేపించారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు.


Post A Comment: