ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

సమాజ మనుగడకు ప్రతి ఒక్కరి ఓటు కీలకమని అదనపు కలెక్టర్ మహేందర్ జీ, అసిస్టెంట్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు.

ఓటు హక్కు వినియోగంపై అవగాహనలో భాగంగా మంగళవారం రోజున జిల్లా మహిళలు పిల్లలు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు వయో వృద్ధులకు అవగాహన కల్పించారు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ

నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ గ్రామం,మండలం, రాష్ట్రం, దేశం బాగుపడాలంటే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఓటు అని, అయితే ఓటు వేసే ముందు వ్యక్తి ఎలాంటి వాడు ఆలోచించి ఓటు వేయాలని, సామాజిక అభివృద్ధి పట్ల అవగాహన ఉన్నవారు, సమర్థులు, పారదర్శకత, జవాబుదారీ తనం, బాధ్యత గల వ్యక్తులను చూసి ఓటు వేయాలని అన్నారు, ఓటు అభ్యర్థించే వ్యక్తి అనేక రకాల ప్రలోభాలకు గురిచేసి డబ్బు మద్యం,ఇతరత్రా తాత్కాలిక ఆనందం పొందే వాటికి దూరంగా ఉండాలని, తాత్కాలిక ఆనందం కోసం డబ్బు తీసుకొని ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కోల్పోతారని అన్నారు.

సమాజ మార్పు ఓటు వినియోగంతోనే సాధ్యమని ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకొని నిజమైన నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు.

అదనపు డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరూ విధిగా ఓటు హక్కు వినియోగంచుకోవాలని, అధికారుల సమన్వయంతో అన్ని వర్గాల ప్రజలు 30 నవంబర్ రోజు ఓటు హక్కు వినియోగంచుకొనుటకు సమీక్షా సమావేశాలు, క్షేత్ర స్థాయిలో పరిశీలన ద్వారా తెలుసుకొని తగు చర్యలు తీసుకొంటున్నామని అన్నారు,

జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ మాట్లాడుతూ నవంబర్ 30 న జరిగే ఎన్నికలలో ఓటు నమోదు శాతాన్ని పెంచుటకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని, ప్రత్యేక అవసరాలుగల వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మహిళలకు పురుషులకు వేరు వేరు క్యూ లైన్లు, అదే విధంగా దివ్యాంగులు వయో వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసామని అన్నారు.

కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ దివ్యాంగులు వయో వృద్ధులకు మరియు ఆయా సంఘాల బాధ్యులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాల ద్వారా ఓటు వినియోగంపై చైతన్యం కల్పించాలని, ప్రజాస్వామ్య మనుగడకు ఓటు ప్రామాణికమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో నోడల్ అధికారి హరి ప్రసాద్, సహాయ నోడల్ అధికారి శ్రీనివాస్ రావు, 

రాష్ట్ర ఎన్నికల ఓటు ఐకాన్ ఓరుగంటి లైలా, మరియు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ,

డీసీపీవో పి సంతోష్ కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, సూపరింటెండెంట్ లక్ష్మీ కాంత్ రెడ్డి, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కే అనితా రెడ్డి వయో వృద్ధులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, మెప్మ మరియు డీఆర్డీఎ ఉద్యోగులు, అంగన్న్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: