తెలంగాణ న్యూస్ మెదక్ జిల్లా ప్రతినిధి పవన్..
మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప. ఎల్లుపేట గ్రామ సర్పంచ్ బోరంఛ సాయిలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు.దూసుకెళ్తున్నారు. సారు కారు సర్కారు అనే నినాదంతో కార్యకర్తలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామం బీఆర్ఎస్ పార్టీనాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ..రైతు బంధు,బీమా, కరెంట్,కళ్యాణ లక్ష్మీ లతో పాటు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసి సకలజనుల అభివృద్ధి కి బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు బాటలేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు,దళిత బందు,బీసీ బంధు,చేప పిల్లల పంపిణీ, గొర్రెల యూనిట్ ల పంపిణీ, గీత కార్మికులు, వితంతులకు ఆసరా పింఛన్లు లాంటి ఎన్నో పథకాలు బీసీ, దళిత,మైనారిటీ వర్గాలకు భద్రతా, భవిష్యత్ ను కల్పించాయన్నారు.
టేక్మాల్ మండలంలో అన్ని గ్రామాల సర్పంచ్లు,ఎంపిటిసిలు, పిఎసియస్ డైరెక్టర్ లు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి పక్షాలకు అవకాశం లేకుండా పార్టీ కోసం పనిచేయాలన్నారు.
మన ప్రాంతం బాగుండాలి బాగుపడాలంటే కెసిఆర్ గారి నాయకత్వాన్ని అందోల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Post A Comment: