ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఓరుగల్లు తూర్పు నియోజకవర్గ యువత అంతా బిఆర్ఎస్ వైపు ఉన్నారని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. నియోజకవర్గంలోని 23వ డివిజన్ కొత్తవాడలో యూత్ నేడు మాజీ కార్పొరేటర్ యేలుగం లీలావతి సత్యనారాయణ,సునీల్ యాదవ్, కట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వనా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి,ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న తీరు నచ్చి నేడు కొత్తవాడలోని యువత అంతా బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజల ఆర్థికాభివృద్ధి చెంది గొప్పగా ఎదగడమే తన లక్ష్యం అన్నారు. ఒక నిరుపేద బిడ్డగా ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలందరూ గొప్పగా ఎదిగి ఆర్థికాభివృద్ధి చెంది గొప్పగా జీవించాలనే సంకల్పంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆ దిశగా తాను నిరంతరం పనిచేస్తున్నానన్నారు.
గులాబీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి ప్రజల సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని నేడు కేసీఆర్ మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్ వికలాంగుల పెన్షన్ బీమా రైతు బంధు ఇలా గొప్పగా ఆదుకునే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని రాబోవు రోజుల్లో ఈ అభివృద్ధి సంక్షేమం ఇలాగే కొనసాగాలంటే బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడి కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు. నేడు కొత్తవాడలోని యూత్ అంతా తన వెంట నడవాలని నేడు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని యూత్ ను కాపాడుకునే జిమ్మెదారి తనదని ఒక నిరుపేద బిడ్డగా రాజకీయాల్లో ఎదుగుతుంటే ఓర్వలేని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజల కోసం నికార్సుగా నిలబడే వ్యక్తిత్వం తనదని ఎమ్మెల్యే అన్నారు.
ఇన్నేళ్లు నియోజకవర్గంలో కనిపించని మోకాలు ఇప్పుడు కనిపిస్తే ఏం లాభమని ప్రజల కోసం ప్రజల వెంట నిరంతరం ప్రజల్లో ఉన్న తనని గెలిపించి కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో పెండెం శ్రీధర్,కరె రవి, పెండెం శ్రీను, కట్ల రాజేష్,వెల్ది శివ, సోమరాతి శ్రీకాంత్,ఆడెపు రాహుల్, మామిండ్ల సాయి నిఖిల్, మెరుగు రంజిత్,కందికట్ల చంద్రమోహన్, తుల గణేష్,సాగర్, హరికృష్ణ, నాయిని రవి, మల్లికార్జున్, కొడం గనేష్,అఖిల్,సన్నీ తదితరులు పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ తో పాటు సునీల్,వెంకటేష్, బాషకార్ల హరికృష్ణ,డివిజన్ యూత్ నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రముఖులు హాజరయ్యారు.

Post A Comment: